కొహెడ, 2026-11-24
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని కోహెడ గ్రామ పంచాయతీలో సర్పంచ్ శ్రీమతి బందెల సుజాత బాలకిషన్ ఘనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
కోహెడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని సర్పంచ్ శ్రీమతి బందెల సుజాత బాలకిషన్, పాలకవర్గ సభ్యులు ఘనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చుక్క శంకర్, జాలిగం స్వప్నబాల్రాజ్, గజ్జెల ప్రవీణ్, పొన్నాల శ్రావణి అశోక్, పంచాయతీ కార్యదర్శి సురేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్, మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల వెంకట్ స్వామి, మంద వంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో హాజరై తమ పేర్లను నమోదు చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పథకం అమలుపై ప్రజలు ఆసక్తి చూపారు.







