నర్మెట్ట, 2026-06-05
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సిద్ధాంత కర్త, ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సారు 78వ జయంతిని పురస్కరించుకుని నర్మెట్టలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సారు జయంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. నర్మెట్ట చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు కంతి ఆంజనేయులు, సర్పంచులు బానోత్ మహేందర్, చెన్నపు రెడ్డి, మాజీ సర్పంచ్ ల అధ్యక్షుడు అమెడపు కమలాకర్ రెడ్డి, నాయకులు నీరేటి సుధాకర్, లింగాల రమేష్, పండుగ రమేష్, నరహరి, విజయ్, రమేష్, పండుగ మల్లేశం, మేకల రాజు, గుండేటి రాజా శేఖర్, పిట్టల ఆంజనేయులు, చెవుల ఓజలు, కిషన్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.









