మహబూబాబాద్, 2026-11-21
మహబూబాబాద్ జిల్లాలోని మూడుకొట్ల సెంటర్, బాబు నాయక్ తండా, అయోధ్య గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో బొమ్మగాని సామ్రాజ్యం అనే మహిళ నాటుసారాతో పట్టుబడింది. ఆమె వద్ద నుంచి ఐదు లీటర్ల నాటుసారాను అధికారులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను మహబూబాబాద్ తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి, బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ రాంప్రసాద్ తెలిపారు.
నాటుసారా తయారు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నాటుసారా తయారీ, విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే, ప్రజలు వెంటనే ఎక్సైజ్ అధికారులకు తెలియజేయాలని కోరారు. ఈ దాడుల్లో ఎస్ఐలు శ్రీనివాస్, సంతోష్, కానిస్టేబుళ్లు నాగరాజు, విజయ్, జాన్ పాషా, గోపి పాల్గొన్నారు.







