వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనగామ వెస్ట్ జోన్ కు చెందిన సిఐ మరియు ఎస్సై లను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం సస్పెండ్ చేశారు. ఒక కేసులో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జనగామ వెస్ట్ జోన్ కు చెందిన ఒక సిఐ మరియు ఒక ఎస్సై లను ఆదివారం సస్పెండ్ చేశారు. వీరిద్దరూ ఒక కేసు విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు అందినట్లు సమాచారం.
సస్పెండ్ అయిన ఎస్సై గతంలో బచ్చన్నపేటలో పనిచేస్తుండగా, సిఐ నర్మెట్టలో విధులు నిర్వర్తించారు. వీరిద్దరూ కలిసి ఒక కేసులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై పోలీస్ కమిషనర్ విచారణ జరిపినట్లు తెలుస్తోంది.
ఎస్సై హమీద్ ఇటీవలే బచ్చన్నపేట నుండి వీఆర్ కు బదిలీ అయ్యారు. విధుల్లో ఉన్న సమయంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో అతనిపై విచారణ జరిగింది. అదేవిధంగా సిఐ కె.అబ్బయ్యపై కూడా అక్రమాల ఆరోపణలున్నాయి.
విచారణ అనంతరం పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఈ ఇద్దరు అధికారులపై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే కేసులో ఇద్దరు అధికారులు సస్పెండ్ అవ్వడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. పోచన్నపేట గ్రామానికి చెందిన ఒక కేసు విషయంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.








