మండలంలోని మాన్సింగ్ తండా గ్రామ శివారు స్మశానవాటికలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి నగదు, స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఎస్సై నైనాల నాగేష్ తెలిపిన వివరాల ప్రకారం, మండలంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో మాన్సింగ్తండా గ్రామ శివారు స్మశానవాటికలో పేకాట ఆడుతున్నారనే సమాచారం పోలీసులకు అందింది.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి, అక్కడ ఆటాడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు అయిన వారి వద్ద నుండి రూ. 2,930 నగదు, నాలుగు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆగాపేటకు చెందిన వల్లంపట్ల ఆడం, గౌరబోయిన ఆశోక్, ముప్పిడి రాజు, తోకల రాజులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.






