హుస్నాబాద్, 16 November
మండలంలోని పోతారం(ఎస్) గ్రామంలో శనివారం అర్ధరాత్రి జరిగిన వైన్స్ షాపు చోరీ కలకలం రేపింది. దుండగులు షాపులోకి చొరబడి నగదుతో పాటు ల్యాప్‌టాప్‌ను అపహరించుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మండలంలోని పోతారం(ఎస్) గ్రామంలో శనివారం అర్ధరాత్రి ఓ వైన్స్ షాపులో దొంగతనం జరిగింది. వైన్ షాపు వెనుక వైపు నుంచి లోపలికి చొరబడిన దుండగులు లక్ష రూపాయల నగదుతో పాటు 25వేల రూపాయల విలువైన ల్యాప్‌టాప్‌ను అపహరించుకెళ్లినట్లు వైన్ షాపు యజమాన్యం తెలిపారు. ఈ చోరీతో పాటు సీసీ కెమెరా ఫుటేజ్‌ను నిల్వ చేసే డీవీఆర్ బాక్స్‌ను కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.







