కోహెడ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 24
కోహెడ మండలంలోని గుండారెడ్డిపల్లిలో గల సిద్ధప్ప వరకవి ఆశ్రమంలో మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిద్ధప్ప వరకవి ట్రస్ట్ చైర్మన్ అనంతవరం మాణిక్యలింగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.
కోహెడ మండలంలోని గుండారెడ్డిపల్లిలో సిద్ధప్ప వరకవి ఆశ్రమంలో మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సిద్ధప్ప వరకవి ట్రస్ట్ చైర్మన్ అనంతవరం మాణిక్యలింగం ఆధ్వర్యంలో గురుపూజోత్సవం నిర్వహించారు. సిద్ధప్ప వరకవి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తులసి పూజ, భజనలు నిర్వహించి, గాయత్రి యజ్ఞం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన శిష్యులు మాట్లాడుతూ, గోల్కొండ కవిగా, తెలంగాణ వేమనగా సిద్ధప్ప వరకవి గుర్తింపు పొందారని తెలిపారు. ఆశ్రమానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. వందలాదిగా తరలివచ్చిన భక్తులకు ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో సిద్ధప్ప వరకవి విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని జిల్లా శాలివాహన సంఘం అధ్యక్షుడు తరిగొప్పుల రామచంద్రం తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచి పిల్లి బాబు, మాజీ సర్పంచి సుతారి కనకయ్య, కాంగ్రెస్ నాయకులు భూంపల్లి సంజీవరెడ్డి, సిద్ధప్ప వరకవి కుటుంబ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.







