హుస్నాబాద్, 2026-11-24
ఓటర్ల జాబితా సవరణలో పేదల ఓటు హక్కును హరించే కుట్ర జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపిస్తుంటే, బీజేపీ నేతలు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
పేరుతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పేదలు, మైనారిటీలు, బలహీన వర్గాల ఓటు హక్కును హరించే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధారాలతో సహా ప్రశ్నిస్తుంటే, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా చొరబాటుదారుల పేరుతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్న బీజేపీ నేతల వైఖరిని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు.
నిన్న కరీంనగర్ గడ్డపై అడుగుపెట్టిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, స్థానిక సమస్యలు, ప్రాంత అభివృద్ధి, కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రజల కనీస అవసరాల గురించి మాట్లాడకుండా, రాహుల్ గాంధీని విమర్శించడం, ఢిల్లీ రాజకీయాలు, మతపరమైన భావోద్వేగాలు, విద్వేషపూరిత ప్రసంగాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం తగదని అన్నారు. నిన్న కరీంనగర్ సభలో శబ్ద కాలుష్యం తప్ప సబ్జెక్టు లేదని, విషయం లేదని విమర్శించారు.
రాహుల్ గాంధీ ప్రశ్నలకు సమాధానం ఏది
రాహుల్ గాంధీ అడుగుతున్నట్లుగా నిర్ణయం ఎవరు తీసుకున్నారు దానికి ఎవరు ఆమోదం తెలిపారు ఓటర్ల డేటాలో మార్పులు ఎవరు చేశారు ఓటర్లను ఏ ప్రాతిపదికన తొలగించారు ఫారం-6లో జరిగిన మార్పులు, ఓటర్ల తొలగింపులకు సంబంధించిన పూర్తి రికార్డులను ఎందుకు అందించడం లేదు ఓటర్ల జాబితాను మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో ప్రజలకు, రాజకీయ పార్టీలకు ఎందుకు అందించడం లేదని మంత్రి ప్రశ్నించారు.
ఎన్నికల కమిషన్ స్వతంత్రతపై సందేహాలు
ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు తప్పించారు ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వ ప్రభావానికి లోనుకాకుండా స్వతంత్రంగా పనిచేయాల్సిన రాజ్యాంగ సంస్థ. అలాంటి సంస్థ నియామక ప్రక్రియలో స్వతంత్రతను బలహీనపరిచి, కేంద్ర పాలకుల ప్రభావానికి లోనయ్యే పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారని నిలదీశారు.
ఎన్నికల డేటా ప్రజలకు అందుబాటులో లేకుండా చేసే విధంగా ఎన్నికల కమిషన్ చట్టంలో సవరణలు ఎందుకు చేశారు అంశంపై పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి చర్చించడానికి బీజేపీ ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు.
ఇతర రాష్ట్రాల్లోనూ ఓటర్ల తొలగింపు ఆరోపణలు
ఉత్తరప్రదేశ్లో కోటి మంది ఓటర్ల తొలగింపుపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆందోళన వ్యక్తం చేయలేదా బీజేపీ అగ్రనేత ఎల్.కే. అద్వానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సైనిక కుటుంబాలకు సంబంధించిన ఓట్ల విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తూ నోటీసులు ఇవ్వలేదా ఇండియా కూటమి అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాతే అద్వానీ వంటి ప్రముఖుల ఓటు హక్కును కొనసాగించేందుకు చర్యలు తీసుకోలేదా బతికి ఉన్న ఓటర్లను తొలగించిన ఘటనలను రాహుల్ గాంధీ పలు రాష్ట్రాల్లో ఆధారాలతో చూపిస్తున్నప్పటికీ, వాటిపై సమాధానం చెప్పకుండా బీజేపీ నేతలు తప్పించుకోవడం సిగ్గుచేటని అన్నారు.







