కోహెడ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 23
కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన కవి జాబేర్ పాషాకు ప్రతిష్టాత్మకమైన ఖమ్మం ఈస్థటిక్స్ పురస్కారం లభించింది. ఆయన రచించిన అగరు ధూపం, ఊదు పొగ కవితా సంపుటికి ఈ ప్రోత్సాహక పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా షీల్డ్ తో పాటు 5 వేల నగదు బహుమతిని అందుకున్నారు.
కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన కవి జాబేర్ పాషాకు ప్రతిష్టాత్మకమైన ఖమ్మం ఈస్థటిక్స్ పురస్కారం లభించింది. తాను రచించిన అగరు ధూపం, ఊదు పొగ కవితా సంపుటికి ప్రోత్సాహక పురస్కారాన్ని గెలుపొందారు. షీల్డ్ తో పాటు, 5 వేల నగదు బహుమతిని అందుకున్నారు.
తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలో 90 కి పైగా కవితా సంపుటాలు పోటీ పడ్డాయి. ఉత్తమ కవితా సంపుటాలకు ఖమ్మంలోని సెడార్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో, అతిథుల సమక్షంలో బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది.







