పర్శరాములు (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 23
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం రసులాబాద్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమాన్ని సర్పంచ్ పచ్చిమడ్ల అనుష స్వామి గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.
రసులాబాద్ గ్రామ సర్పంచ్ పచ్చిమడ్ల అనుష స్వామి గౌడ్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన ఈ కుటుంబ బీమాను అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ జీవిత బీమాను అందించడం మంచి పరిణామమని, కుటుంబంలో 60 సంవత్సరాలు లోపు ఉన్న సభ్యులందరికీ దీనిని వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో గుంట భూమి ఉన్న ప్రతి రైతుకు రైతు బీమాను అందించారని, అదేవిధంగా ఆ పథకాన్ని మళ్లీ కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ వర్మ, ఉప సర్పంచ్ సుదర్శన్, మాజీ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్, పంచాయతీ కార్యదర్శి రాజు, వార్డు సభ్యులు బహదూర్ రాధిక, శ్రీకాంత్, పర్శరాములు, మండల సీనియర్ అసిస్టెంట్ మదన్, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు ఎల్లయ్య, మల్లయ్య, అబ్దుల్లా, శ్రీనివాసు, యాదయ్య, నాగుల్, యువకులు పాల్గొన్నారు.







