వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పొలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్బంగా, పోలింగ్ సామగ్రి పంపిణీ జరుగుతున్న విధానంపై పోలీస్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన, ఎన్నికల లెక్కింపు కేంద్రాలు మరియు బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరిచే స్ట్రాంగ్ రూంలను కూడా పరిశీలించారు.
పోలింగ్ కమిషనర్, అడిషినల్ కలెక్టర్ పింకేష్ కుమార్ మరియు వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి, ఓట్ల లెక్కింపు కేంద్రంలో చేయాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు.
ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులందరూ సన్నద్దం కావాలని, ఎన్నికల నియమాలను అత్రికమించకుండా జాగ్రత్త పడాలని పోలీస్ కమిషనర్ సూచించారు.








