మద్దూరు, 2026-11-26
అంబేద్కర్ కు నివాళులర్పించిన సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం మర్మాముల గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్, భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పితామహుడు డాక్టర్ అంబేద్కర్ కు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్, వార్డు సభ్యులు ఆరిఫ్, స్వప్న బిక్షపతి, స్వాతి మహిపాల్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆలేటి విష్ణు, అంగన్వాడి టీచర్ అనంత జయశ్రీ, ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం భాస్కర్, పాఠశాల విద్యార్థులు, గ్రామంలోని పెద్దలు, యువకులు పాల్గొన్నారు.







