కోహెడ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 26
హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం సముద్రాల గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి సహాయ నిధి ద్వారా, హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. పున్నం శ్రావ్య ప్రసన్నకు రూ. 1,96,000 చెక్కును అందజేశారు.
హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం సముద్రాల గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి సహాయ నిధి ద్వారా, హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. సీఎం సహాయ నిధి లబ్ధిదారులలో పున్నం శ్రావ్య ప్రసన్న (భర్త సందీప్)కు రూ. 1,96,000 చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా పున్నం యాదయ్య మాట్లాడుతూ, తమ కుటుంబ సభ్యులకు ఆపదలో ఆదుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డికి, రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
అదేవిధంగా గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో మేలు చేస్తుందని, ఆపదలో ఆపన్న హస్తాన్ని అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి, రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సముద్రాల గ్రామ పంచాయతీ పాలకవర్గం, ఉప సర్పంచ్ చింతకింది సింగరయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పున్నం సత్తయ్య, ఉపాధ్యక్షులు గట్టు శ్రీనివాస్, వార్డ్ మెంబర్ పిల్లి సతీష్, కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ గడ్డం రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పరకాల శ్రీనివాస్, ఉప్పుల వెంకన్న, పంతంగి కనకయ్య, చేర్యాల తిరుపతి, పిల్లి మహేందర్, ఇసంపల్లి తిరుపతి, మెతుకు రజనీకర్ రెడ్డి, పూల తిరుపతి, అజార్, రవి, ప్రజలు పాల్గొన్నారు.







