హుస్నాబాద్, 2026-11-21
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రాంప్రసాద్ హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు
ఈ సందర్భంగా ఏఎస్ఐ రాంప్రసాద్ మాట్లాడుతూ, మైనర్ బాలబాలికలకు తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించాలని, తమతో పాటు ఇతరుల ప్రాణాల భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని ఏఎస్ఐ రాంప్రసాద్ కోరారు.