మండలంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా రవాణా శాఖ అధికారులు వరుసగా రెండో రోజు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలకు విద్యార్థులను తరలించే ఆటోలు, టాటా మ్యాజిక్ వాహనాలు, బస్సులను తనిఖీ చేశారు. సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించిన, ఆర్సీ, ఎఫ్సీ, పర్మిట్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ తనిఖీల్లో మోటార్ వాహన తనిఖీ అధికారులు ఎస్. వెంకట్ రెడ్డి, ఖాసీం, సుందర్ లాల్ పాల్గొన్నారు.