తరిగొప్పుల, 2026-11-24
జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంకుషాపూర్ గ్రామ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో, బైరాన్ పల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ మార్కండేయ మహారాజ్ ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రూ.5 వేల విరాళాన్ని అందజేశారు. గ్రామ పద్మశాలి సంఘం శాఖ అధ్యక్షుడు మాదాసు బిక్షపతి ఆధ్వర్యంలో మంగళవారం ఆలయ నిర్వాహకులకు ఈ మొత్తాన్ని అందించారు.

కుల బాంధవ్యంతో పాటు భక్తిభావాన్ని చాటుకుంటూ, ఆలయ ప్రతిష్ఠాపనకు తమ వంతు సహకారం అందించినట్లు సంఘ సభ్యులు తెలిపారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో స్వామివారి ప్రతిష్ఠాపన వేడుకలు ఘనంగా జరగాలని వారు ఆకాంక్షించారు.
ఆలయ నిర్మాణం, ధార్మిక కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని, మార్కండేయ స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అధ్యక్షుడు మాదాసు బిక్షపతి కోరారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు సాంబారి కృష్ణమూర్తి, తాటికొండ దశరథం, తాటికొండ నాగరాజు, తాటికొండ మోహన్, తాటికొండ లింగయ్య, బొడ్డు రాజయ్య, సాంబారి రామలింగం, రవి, పోతన సాయికుమార్, బొడ్డు చందు, తాటికొండ ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.