జిల్లా స్థాయి ఇండోర్ గేమ్స్ పోటీల్లో భాగంగా నిర్వహించిన క్యారమ్స్ పోటీల్లో బచ్చన్నపేట తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి బి రోహిత్ ప్రథమ స్థానం సాధించారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేతుల మీదుగా విద్యార్థులు, పాఠశాల పీఈటీ మానుపాటి శ్రీహరి బహుమతి అందుకున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులు ట్రోఫీని కైవసం చేసుకున్నారు.
విద్యార్థుల విజయంపై ప్రిన్సిపల్ భారతి దేవి, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.







