జిల్లాలోని నాలుగు ఆదర్శ పాఠశాలల బాలికల హాస్టళ్లలో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హత గల మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఖాళీల వివరాల ప్రకారం, కొడకండ్ల పాఠశాలలో 1 ఏఎన్ఏం, జఫర్గడ్ పాఠశాలలో 1 ఏఎన్ఏం, 1 అసిస్టెంట్ కుక్, 1 వాచ్ ఉమెన్, స్టేషన్ ఘన్పూర్ పాఠశాలలో 1 కేర్ టేకర్ కం వార్డెన్, 1 ఏఎన్ఏం, బచ్చన్నపేట పాఠశాలలో 1 హెడ్ కుక్, 2 అసిస్టెంట్ కుక్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 8 పోస్టులు భర్తీ చేయబడనున్నాయి.
అభ్యర్థుల వయస్సు నోటిఫికేషన్ తేదీ నాటికి 40 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సి, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
అర్హతల విషయానికి వస్తే, కేర్ టేకర్ కం వార్డెన్ పోస్టుకు డిగ్రీతో పాటు D.Ed./B.Ed. అర్హత అవసరం. గౌరవ వేతనం రూ.12,500/- కాగా, ఏఎన్ఏం పోస్టులకు ఇంటర్మీడియట్, అర్హతగా ఏఎన్ఏం శిక్షణ అవసరం మరియు వేతనం రూ.7,800/-.
అభ్యర్థులు తమ ఒరిజినల్ విద్యార్హత ధృవపత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను 10-06-2026 సాయంత్రం 5 గంటలలోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, జనగామలో సమర్పించవలెను.






