సిద్దిపేట, 2026-11-24
సిద్దిపేట జిల్లాలోని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ను సీపీ రేష్మి పెర్మల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని వివిధ రికార్డులను పరిశీలించి, పోలీస్ స్టేషన్ నిర్వహణ మరియు భద్రతా వ్యవస్థ పనితీరుపై సమీక్ష నిర్వహించారు.
గ్రామాల్లో భద్రతా వ్యవస్థ పటిష్టతకు సూచనలు
అనంతరం పోలీస్ సిబ్బందికి గ్రామాల్లో జరుగుతున్న వివిధ సంఘటనలు, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. గ్రామాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కుకునూరుపల్లి స్టేషన్ ఆఫీసర్ ఎస్సై బాలకృష్ణ పుష్పగుచ్ఛం అందించి సీపీకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తొగుట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కుకునూరుపల్లి ఎస్సై బాలకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.







