సిద్దిపేట, 2026-11-24
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లిలో డ్రైనేజీ సమస్య తీవ్రమైంది. ఆలయ పరిసరాలు, ప్రధాన రహదారుల వెంట మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు, స్థానిక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లిలో డ్రైనేజీ సమస్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఆలయ పరిసరాలు, ప్రధాన రహదారుల వెంట మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు, స్థానిక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
డ్రైనేజీల నుంచి వెలువడుతున్న దుర్వాసనతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పండుగలు, జాతర సమయాల్లో భక్తుల రద్దీ పెరిగే నేపథ్యంలో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. సంబంధిత ఆలయ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీలను శుభ్రం చేయడంతో పాటు, మురుగునీరు రోడ్లపైకి రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ కొమురవెల్లి కోడెల స్తంభం వద్ద మురుగునీటి సమస్యపై వార్తలు వెలువడ్డాయి.







