బచ్చన్నపేట్, 2026-11-23
వైద్య ఖర్చుల కోసం రూ.70 వేల ఆర్థిక సాయం గ్రామస్తులు, ప్రగతి యూత్ అసోసియేషన్ సభ్యులు
మండల కేంద్రానికి చెందిన తేలుకంటి భరత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. భరత్ చికిత్స పొందుతున్న సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం, గ్రామానికి చెందిన వారు, ప్రగతి యూత్ అసోసియేషన్ సభ్యులు, గ్రూప్ అడ్మిన్ బొమ్మెన కేశవర్ధన్ (బొమ్మెన రాజు) విజ్ఞప్తి మేరకు స్పందించి రూ.70 వేల ఆర్థిక సాయం అందించారు. సోమవారం, ఈ మొత్తాన్ని రాజు ఆధ్వర్యంలో భరత్ ఇంటికి వెళ్లి తల్లి అరుణ, సోదరుడు సాయి ప్రదీప్‌కు అందజేశారు. గ్రామస్తులతో ఆప్యాయంగా ఉండే భరత్ అకాల మరణం ఆ కుటుంబానికి తీరని లోటని సభ్యులు పేర్కొన్నారు. తన కుమారుడి కోసం ఆర్థిక సాయం అందించిన రెండు గ్రూపుల సభ్యులకు అరుణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరబోయిన అంజయ్య, కొత్తపెళ్లి ప్రవీణ్, దొంతుల చంద్రమౌళి, తేలుకంటి శ్రీనివాస్, గుంటిపల్లి మల్లికార్జున్, బాసెట్టి వేణు, గిరబోయిన బాలసిద్ధులు, తేలుకంటి వెంకట్ రాజు, గిరబోయిన పరశురాములు తదితరులు పాల్గొన్నారు.







