ఇప్పలగడ్డ గ్రామపంచాయతీలో శుక్రవారం 'ఫ్రైడే డ్రై డే' కార్యక్రమం, పశువులకు గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలు, మరియు అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు దుస్తుల పంపిణీ కార్యక్రమాలు గ్రామ సర్పంచ్ దారావత్ రాజమణి (రాజు నాయక్) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
దోమల నివారణ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల అరికట్టడానికి ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని సర్పంచ్ ప్రజలకు సూచించారు. గ్రామంలోని మోరీలు, కాలువలను శుభ్రపరచడం ద్వారా పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు.
రైతులు తమ పశువులకు గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. అంగన్వాడి కేంద్రంలో లభించే పౌష్టికాహారాన్ని చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శి, ఏపీఓ, పశువుల అధికారి, అంగన్వాడి సూపర్వైజర్, రాజకీయ నాయకులు, గ్రామ సిబ్బంది, మరియు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.








