విద్యార్థినులు (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 17
అక్కెనపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ జిల్లా స్థాయి ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ మరియు వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బుద్ధా కృష్ణవేణి, బద్దిపడగ శ్రీజని రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.
అక్కెనపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ , జిల్లా స్థాయి ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ మరియు వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ పోటీల్లో పాల్గొన్న బుద్ధా కృష్ణవేణి, బద్దిపడగ శ్రీజని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. విద్యార్థులు సిద్దిపేట గౌరవ ఆర్డిఒ సదానందం చేతుల మీదుగా బహుమతి స్వీకరించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మంద జానయ్య విద్యార్థినులను అభినందిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రాధాన్యత, ఓటు హక్కు, పౌరుల బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవడంలో ఇటువంటి పోటీలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ పోటీలకు గైడ్ టీచర్లుగా వ్యవహరించిన సాంఘిక శాస్త్ర సీనియర్ అధ్యాపకులు ఎ. శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచడం ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. కసిరెడ్డి రవీందర్ రెడ్డి విద్యార్థినులను అభినందిస్తూ, వారి విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
అదేవిధంగా అధ్యాపకులు ప్రభాకర్, పర్శరాములు, నర్సయ్య, సుధాకర్, స్వాతి, శ్రీనివాస్ తదితరులు విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తోటి విద్యార్థులు కూడా తమ సహచరుల విజయాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.







