తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా, ఆడపడుచుల ఆత్మీయతకు, ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ, ముఖ్యంగా జిల్లా , ఎల్లంల గ్రామ మహిళామణులందరికీ ఎల్లంల గ్రామ సర్పంచ్ దేవునూరి సతీష్, ఎల్లంల గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదు, మన ఆడపడుచుల ఆత్మీయతకు, కుటుంబ బంధాలకు, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అని ఆయన అన్నారు. కుటుంబ సంతోషం కోసం నిరంతరం శ్రమించే ప్రతి ఆడపడుచు జీవితం ఆనందాలతో నిండాలని, వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని, ప్రతి ఇంటా సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
మన తెలంగాణ ఆడపడుచులు, ముఖ్యంగా నా ఎల్లంల గ్రామ ఆడబిడ్డలు, మహిళలు సంతోషంగా, గౌరవంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ మన సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని భావితరాలకు అందించాలని కోరుకుంటున్నట్లు సర్పంచ్ దేవునూరి సతీష్ పేర్కొన్నారు.
ఈ బతుకమ్మ పండుగ ప్రతి మహిళ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబంలో ఆనందాల పూలు పూయాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ఆడపడుచులందరికీ, ముఖ్యంగా నా ఎల్లంల గ్రామ ఆడబిడ్డలకు, మహిళలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.









