ప్రజాసేవలో ముందుంటున్న గోపగోని శ్రీధర్ గౌడ్
మండల కేంద్రం గ్రామ శివారులో శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన కల్వర్టుకు సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ స్పందించి, సొంత నిధులతో కాంక్రీట్ మరమ్మతులు చేయించారు. కల్వర్టుపై ఏర్పడిన గుంతల కారణంగా ఇటీవల రాత్రి సమయంలో బైక్పై వెళ్తున్న భార్యాభర్తలు ప్రమాదానికి గురైన నేపథ్యంలో, సర్పంచ్ వెంటనే స్పందించి మరమ్మతు పనులు చేపట్టారు. కల్వర్టుపై ఏర్పడిన గుంతలు, రంధ్రాలను కాంక్రీట్ మిశ్రమంతో పూడ్చి, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. రాత్రి వేళల్లో వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా ముందస్తుగా మరమ్మతులు చేయించడం పట్ల స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తూ, ప్రజల భద్రతకు ప్రాధాన్యమిచ్చిన సర్పంచ్ శ్రీధర్ గౌడ్ను గ్రామస్తులు అభినందించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొలెపాక యాదగిరి, కొన్నె యాదాలక్ష్మి, చంద్రయ్య, పాతూరి ప్రశాంత్, నిమ్మకంటి బాపురాజు తదితరులు పాల్గొన్నారు.

