గజ్వేల్, 11 November
గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వాహనదారులపై నమోదు చేసిన కేసులకు సంబంధించి, బుధవారం గజ్వేల్ గౌరవనీయ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో 35 కేసులు పరిష్కరించబడ్డాయి. ఈ కేసుల్లో 30 మందికి జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి జరిమానాలు విధించారు.
గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వాహనదారులపై నమోదు చేసిన కేసులకు సంబంధించి, బుధవారం గజ్వేల్ గౌరవనీయ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో 35 కేసులు పరిష్కరించబడ్డాయి.
కేసుల వివరాలు
మొత్తం 34 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో, 4 కేసుల్లో ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.40,000 జరిమానా విధించారు. మిగిలిన 30 కేసుల్లో నిందితులకు 1 రోజు నుండి 5 రోజుల వరకు జైలు శిక్ష విధించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ఒక కేసులో రూ.5,000 జరిమానా విధించారు. మొత్తం జరిమానా రూ.45,000/-.
జైలు శిక్ష వివరాలు
జైలు శిక్ష వ్యవధి మరియు శిక్ష పడిన వ్యక్తుల సంఖ్య వివరాలు ఈ విధంగా ఉన్నాయి: 01 రోజు: 08 మంది 02 రోజులు: 07 మంది 03 రోజులు: 04 మంది 04 రోజులు: 07 మంది 05 రోజులు: 04 మంది మొత్తం: 30 మందికి జైలు శిక్ష విధించారు.
కమిషనర్ సూచనలు
ఈ సందర్భంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం నేరం మాత్రమే కాదు, అది మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా అత్యంత ప్రమాదకరం. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రాంగ్రూట్లో ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయి. సురక్షితంగా గమ్యస్థానం చేరడమే లక్ష్యంగా వాహనాలు నడపాలి. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలి. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. నిబంధనలు పాటిస్తూ రోడ్డు భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలి అని స్పష్టం చేశారు.






