ఆగపేట గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద నిర్వహిస్తున్న ఫామ్ పాండ్ (వ్యవసాయ క్షేత్ర చెరువు) పనులను గ్రామ సర్పంచ్ డాక్టర్ పగిడిపాటి రాజు పరిశీలించారు.
ఈ సందర్భంగా పనుల్లో పాల్గొంటున్న ఉపాధి కూలీలతో మాట్లాడి, వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనుల నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
అధిక సంఖ్యలో కూలీలు ఉపాధి హామీ పనుల్లో పాల్గొనడం ద్వారా గ్రామానికి మరిన్ని అభివృద్ధి పనులు, మెటీరియల్ కాంపోనెంట్ పనులు చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని, తద్వారా గ్రామ అభివృద్ధికి మరింత తోడ్పాటు అందుతుందని సర్పంచ్ తెలిపారు.
గ్రామంలో ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వ్యవసాయ అభివృద్ధికి ఉపయోగపడే ఫామ్ పాండ్ నిర్మాణాలను ప్రోత్సహిస్తామని, కూలీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పూల శ్రీకాంత్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.






