సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్రీమతి రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు, హుస్నాబాద్ ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో కోహెడ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ తనిఖీలలో సుమారు 50 వాహనాల పత్రాలను పరిశీలించి, సరైన పత్రాలు లేని వాటికి జరిమానాలు విధించారు. అక్రమంగా విక్రయిస్తున్న మద్యం స్వాధీనం చేసుకున్నారు.
యువతకు ఏసీపీ సూచనలు
ఈ సందర్భంగా హుస్నాబాద్ ఏసీపీ సదానందం మాట్లాడుతూ, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. వ్యాపార సంస్థలు తమ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సిఐ శ్రీధర్, కోహెడ ఎస్సై అభిలాష్, అక్కన్నపేట ఎస్సై ప్రశాంత్, కొమురవెల్లి ఎస్ఐ మహేష్, మద్దూర్ ఎస్ఐ ఆసిఫ్, పోలీస్ సిబ్బందితో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






