యువత డ్రగ్స్, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఇప్పలగడ్డ గ్రామ సర్పంచ్ ధరావత్ రాజమణి రాజు నాయక్ పిలుపునిచ్చారు. వరంగల్ సీపీ ఆదేశాల మేరకు మండలం ఇప్పలగడ్డ గ్రామంలో డ్రగ్స్, మద్యపానం, మహిళలపై వేధింపులు, బాల్యవివాహాలు, ర్యాగింగ్ తదితర అంశాలపై సర్పంచ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ధరావత్ రాజమణి రాజు నాయక్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. యువతను సరైన మార్గంలో నడిపించడంలో తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలన్నారు కార్యక్రమంలో సీఐ మాట్లాడుతూ డ్రగ్స్, మాదకద్రవ్యాలు, మద్యపానానికి యువత అలవాటు పడకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం యువత ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు నేరాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. గ్రామంలో డ్రగ్స్ విక్రయం, వినియోగం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మహిళలపై వేధింపులు, బాల్యవివాహాలు, ర్యాగింగ్‌ను సహించబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐ, ఎస్ఐ, గ్రామ ఉప సర్పంచ్ ఇట్టబోయిన సురేష్, వార్డు సభ్యులు ఇట్టబోయిన శ్రీనివాస్, బానోత్ కుమార్, బానోత్ మంజుల బలరాం, బానోత్ రవి సరిత, గ్రామ ప్రజలు, యువత, మహిళలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి : సర్పంచ్
Share:

సారాంశం
మండలం ఇప్పలగడ్డ గ్రామంలో సర్పంచ్ ధరావత్ రాజమణి రాజు నాయక్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
ముఖ్య విషయాలు
- వరంగల్ సీపీ ఆదేశాల మేరకు మండలం ఇప్పలగడ్డ గ్రామంలో డ్రగ్స్, మద్యపానం, మహిళలపై వేధింపులు, బాల్యవివాహాలు, ర్యాగింగ్ తదితర అంశాలపై సర్పంచ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
- ఈ సందర్భంగా సర్పంచ్ ధరావత్ రాజమణి రాజు నాయక్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
- డ్రగ్స్ వినియోగం యువత ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు నేరాలకు దారితీసే అవకాశం ఉందన్నారు.
- యువత డ్రగ్స్, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఇప్పలగడ్డ గ్రామ సర్పంచ్ ధరావత్ రాజమణి రాజు నాయక్ పిలుపునిచ్చారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
387ఆర్టికల్స్
97,833వ్యూస్










