జనగామ పట్టణంలోని 5వ వార్డుకు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో ధరావత్ మహేందర్, కాసుల రాజు, ఎనగందుల లక్ష్మయ్య, బాసెట్టి శేఖర్, కాసుల కన్నయ్య, కే. మేడీ శ్రీశైలం, దొణికే రవికుమార్, బండి కృష్ణ, పోలోజు చారి, మాగంటి కిరణ్, దేవుని మహేష్, దోర్నాల కుమార్, నాయిని సంతోష్, గోరంతల నాగరాజు తదితరులు పార్టీలో చేరారు.
ఈ చేరిక కార్యక్రమం 5వ వార్డు ఇన్చార్జి ప్రతాప్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









