సిద్దిపేట, 25 September
బాలికను కిడ్నాప్ చేసి, పోక్సో చట్టం కింద నమోదైన కేసులో నిందితుడు కొమ్ముగళ్ల బాలకృష్ణ (35)ను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. అతనికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,05,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వై.జయప్రసాద్ తీర్పు వెలువరించారు. ఈ కేసు సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో న నమోదైంది.
బాలికను కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడు కొమ్ముగళ్ల బాలకృష్ణ (35)ను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. పోక్సో చట్టం కింద నమోదైన ఈ కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.1,05,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వై.జయప్రసాద్ తీర్పు వెలువరించారు. సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో న ఈ కేసు నమోదైంది. కేసు నమోదైన అనంతరం అప్పటి దర్యాప్తు అధికారి, ఇన్స్పెక్టర్ నందీశ్వర్‌రెడ్డి సమగ్రంగా దర్యాప్తు చేపట్టి కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. అనంతరం నిందితుడిపై పటిష్టమైన అభియోగపత్రాన్ని న్యాయస్థానంలో దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది సాదుల ఆత్మారాములు వాదనలు వినిపించారు. పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం బాలకృష్ణను దోషిగా నిర్ధారించింది. దీంతో 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.1,05,000 జరిమానా విధించింది. కేసు దర్యాప్తు, విచారణలో ఇన్స్పెక్టర్లు పి.మహేందర్‌రెడ్డి, వాసుదేవరావు, అనుసంధాన అధికారి శ్రీనివాస్‌రెడ్డి, సీడీఓ బాపురెడ్డి, భరోసా కేంద్రం ఇన్చార్జి ఇన్స్పెక్టర్ బి.దుర్గ, భరోసా న్యాయాధికారి సౌమ్య, భరోసా కేంద్రం సిబ్బంది సహకరించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీసుశాఖ కట్టుబడి ఉంటుందని, నేరాలకు పాల్పడిన వారికి చట్టప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకోవడంలో రాజీ ఉండదని సీపీ స్పష్టం చేశారు.












