దుబ్బాకలో కత్తి కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శ్రీ సిద్ధి వినాయక స్వామి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. 12వ రోజు ఉత్సవాల్లో చికోడ్, పద్మనాభునిపల్లి గ్రామాలకు చెందిన భజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
భక్తిగీతాలు ఆలపిస్తూ భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భజన గీతాలతో ఉత్సవ ప్రాంగణం భక్తి పారవశ్యంతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో భక్తులు, నిర్వాహకులు పాల్గొన్నారు.












