హనుమకొండ, శనివారం రాత్రి
హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణ కాలనీలో శనివారం రాత్రి భార్యను భర్త అత్యంత దారుణంగా హత్య చేశాడు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.
హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధి కృష్ణ కాలనీలో శనివారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాలే ఈ హత్యకు దారితీసినట్లు ప్రాథమిక సమాచారం. ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.
నిందితుడు మేస్త్రీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సుమారు ఆరు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే కొంతకాలంగా వీరి మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. శనివారం రాత్రి భార్య కాళ్లు, చేతులు కట్టి, అనంతరం మెడ కోసి హత్య చేసినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న కాకతీయ యూనివర్సిటీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఏమిటి కుటుంబ కలహాలే ఈ దారుణానికి దారితీశాయా అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ప్రేమతో ప్రారంభమైన వారి దాంపత్య జీవితం చివరకు విషాదాంతంగా ముగియడంతో ఇద్దరు చిన్నారులు తల్లిని కోల్పోయి అనాథలయ్యారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.







