రేపు జనగామలో సీఎంకు ఉత్తరాలు రాసే కార్యక్రమం
జనగామ జిల్లాలోని అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే హెల్త్ కార్డుల తరహాలో హెల్త్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ 143 యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి అస్కని మారుతీ సాగర్ ల పిలుపు మేరకు రేపు శుక్రవారం ఉదయం 11 గంటలకు జనగామలోని గాంధీ విగ్రహం వద్ద ఉత్తరాల ఉద్యమం ప్రారంభం కానుంది. ఈ ఉద్యమంలో భాగంగా జర్నలిస్ట్ తమ డిమాండ్లను పోస్ట్ కార్డులో రాసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చేరేలా ఉత్తరాల ఉద్యమాన్ని ప్రారంభిద్దామని యూనియన్ తెలిపింది. కావున జర్నలిస్టులందరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలని టీయూడబ్ల్యూ జే హెచ్ 143 యూనియన్ జనగామ జిల్లా శాఖ ఆహ్వానిస్తోంది. మండలం, పట్టణం, జిల్లా కేంద్రాలలోని జర్నలిస్టులు తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం తరలి రావాలని కోరుతున్నారు.












