తరిగొప్పుల: తెలంగాణ గిరిజన సర్పంచుల జనగామ జిల్లా అధ్యక్షుడు కొర్ర స్వరూప రాజేందర్ నాయక్ ఆధ్వర్యంలో తరిగొప్పుల మండల గిరిజన సర్పంచుల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని గిరిజన సర్పంచుల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో ఈ కమిటీని ఎంపిక చేశారు.మండల అధ్యక్షుడిగా కొత్తతండా సర్పంచ్ భూక్య ధనుష్ నాయక్, వర్కింగ్ అధ్యక్షుడిగా భూక్య రవి నాయక్, ఉపాధ్యక్షుడిగా గుగులోత్ లలిత రాజు నాయక్, ప్రధాన కార్యదర్శిగా లావుడియా సుగుణ భీమా నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు భూక్య ధనుష్ నాయక్ మాట్లాడుతూ.. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గిరిజన సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని గిరిజన సర్పంచులందరినీ సమన్వయం చేసుకుంటూ తండాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సర్పంచుల హక్కులు, గ్రామాల అభివృద్ధి కోసం తరఫున ఐక్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.జిల్లా అధ్యక్షుడు కొర్ర స్వరూప రాజేందర్ నాయక్ నూతన కమిటీ సభ్యులను అభినందించారు. గిరిజన సర్పంచులంతా సమన్వయంతో పనిచేసి తండాల అభివృద్ధికి, గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అల్పతి నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ రాజమణి రాజు నాయక్తో పాటు పలువురు గిరిజన సర్పంచులు పాల్గొన్నారు.
తరిగొప్పుల గిరిజన సర్పంచుల నూతన కమిటీ ఏకగ్రీవం
Share:

సారాంశం
మండల అధ్యక్షుడిగా భూక్య ధనుష్ నాయక్ ఎన్నిక
ముఖ్య విషయాలు
- తరిగొప్పుల: తెలంగాణ గిరిజన సర్పంచుల జనగామ జిల్లా అధ్యక్షుడు కొర్ర స్వరూప రాజేందర్ నాయక్ ఆధ్వర్యంలో తరిగొప్పుల మండల గిరిజన సర్పంచుల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
- మండలంలోని గిరిజన సర్పంచులందరినీ సమన్వయం చేసుకుంటూ తండాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
- గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
- మండలంలోని గిరిజన సర్పంచుల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో ఈ కమిటీని ఎంపిక చేశారు.మండల అధ్యక్షుడిగా కొత్తతండా సర్పంచ్ భూక్య ధనుష్ నాయక్, వర్కింగ్ అధ్యక్షుడిగా భూక్య రవి నాయక్, ఉపాధ్యక్షుడిగా గుగులోత్ లలిత రాజు నాయక్, ప్రధాన కార్యదర్శిగా లావుడియా సుగుణ భీమా నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు భూక్య ధనుష్ నాయక్ మాట్లాడుతూ..
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

నాగపురి కిషన్
Reporter
Tharigoppula
4ఆర్టికల్స్
113వ్యూస్










