సిద్దిపేట, 2026-11-20
చెక్ బౌన్స్ (ఎన్ఐ యాక్ట్) కేసుల సత్వర పరిష్కారం కోసం ఈనెల 21వ తేదీ శనివారం సిద్దిపేట జిల్లా న్యాయస్థాన ప్రాంగణంలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు సిద్దిపేట ప్రధాన జిల్లా మరియు సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) చైర్మన్ జి. సుదర్శన్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ (ఎన్ఐ యాక్ట్) కేసులను ఇరుపక్షాల అంగీకారంతో రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు ప్రత్యేక లోక్ అదాలత్ మంచి అవకాశమని పేర్కొన్నారు.
లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు ఇరువర్గాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని వివరించారు.
న్యాయమూర్తి విజ్ఞప్తి
కావున, పెండింగ్లో ఉన్న చెక్ బౌన్స్ కేసులకు సంబంధించిన కక్షిదారులు, న్యాయవాదులు ఈ ప్రత్యేక లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని, పరస్పర అంగీకారంతో అత్యధిక కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్జి జి. సుదర్శన్ కోరారు.