తరిగొప్పుల, 19 November
26 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ
పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో కళ్యాణలక్ష్మి పథకం కీలక పాత్ర పోషిస్తోందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 26 మంది లబ్ధిదారులకు బుధవారం ఆయన కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.... పేద కుటుంబాలకు ఆడబిడ్డల వివాహం ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి పథకం ఎంతో ఉపయోగకరంగా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా వేలాది నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించిందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని తెలిపారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు.
కళ్యాణలక్ష్మి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహమ్మద్ ముస్తఫా, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్ రెడ్డి, సర్పంచులు కుర్రె మల్లయ్య, దండెం శ్రీనివాస్, మంచినీళ్ల రాజు, భూక్య రవి నాయక్,బైకాని రమా బాలరాజు యాదవ్,భూక్య సమ్మయ్య,గూగులోత్ లలిత రాజు, అధికార ప్రతినిధి చిలివేరి లింగం,మాజీ ఎంపీపీ జోన్నగొని హరిత సుదర్శన్ గౌడ్, మాజీ జెడ్పిటిసి ముద్దసాని పద్మజా వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దామెర ప్రభుదాస్,చెన్నూరి సంజీవ,తాళ్లపల్లి రాజేశ్వర్ గౌడ్,బత్తిని సురేందర్ గౌడ్,సాయిలు రాజు, మాల్యాల సుధీర్,చింతల జైపాల్ రెడ్డి, అంకం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.







