విజయవాడలోని కృష్ణలంక ప్రాంతంలో మహిళ హత్య కలకలం రేపింది. పండిట్ నెహ్రూ బస్టాండ్ ఎదురుగా ఉన్న రామయ్య లాడ్జిలో పైడిశెట్టి ఎర్నమ్మ (35) అనే మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమె శుభమస్తు వస్త్ర దుకాణంలో సేల్స్ ఉమెన్‌గా పనిచేస్తున్నారు.
ఇంటి నుంచి పనికి వెళ్లిన ఎర్నమ్మ తిరిగి రాకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఎర్నమ్మ రాము అనే యువకుడితో కలిసి లాడ్జికి వెళ్లినట్లు గుర్తించారు. రామయ్య లాడ్జి గదిలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, ఇది హత్యగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో అనుమానితుడైన రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.


