గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి పులివెందుల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
అవినాశ్‌రెడ్డి నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసుల ప్రతిని అందజేశారు. మరో ప్రతిని వాట్సాప్ ద్వారా కూడా పంపించారు. నామినేషన్ల సమయంలో ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్న సమాచారం మేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా భద్రతను పెంచినట్లు సమాచారం.
ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో చర్యలు నోటీసుల ప్రతిని నివాసంలో అందజేసిన పోలీసులు వాట్సాప్ ద్వారా మరో ప్రతిని పంపిన అధికారులు నియోజకవర్గంలో భద్రత పెంపు






