Hanamkonda, 2026-11-22
ప్రధాన ఆలయ ఆర్చికి ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన
నర్సంపేటలోని శ్రీ ధర్మశాస్తా అయ్యప్ప స్వామి దేవాలయంలో నూతనంగా నిర్మించిన కామాక్షి అన్నప్రసాద మండప సహిత కళాతోరణ వేదిక ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన ఆలయ ఆర్చికి ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ శుభ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్, స్థానిక 26వ వార్డు కౌన్సిలర్ మండల శ్రీదేవి శ్రీనివాస్ పాల్గొన్నారు.
అనంతరం ఆలయంలోని పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించి, ఆలయ కమిటీ ప్రతినిధులకు, అయ్యప్ప స్వామి సేవా ట్రస్ట్ బాధ్యులకు, అయ్యప్ప స్వాములకు, భక్తులకు అయ్యప్ప ఆశీస్సులు కలగాలని, దీవెనలు అందరికీ అందాలని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సింగిరికొండ మాధవ శంకర్ స్వామి, అధ్యక్షులు సైఫా సురేష్, ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి, కోశాధికారి దొడ్డ రవీందర్, మాదారపు చంద్రశేఖర్, శ్రీరామ్ ఈశ్వరయ్య, నందయ్య పాలకుర్తి శ్రీనివాస్, శ్రీరామ్ కిరణ్, చించారావు మరియు ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ ధర్మశాస్తా అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్, పాలకవర్గం పాల్గొన్నారు.







