తరిగొప్పుల, 2026-11-21
ముదిరాజులకు విద్య,ఉద్యోగాల్లో సముచిత వాటా కల్పించాలి జనగామ ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ ఇన్చార్జి చిలువేరు లింగం డిమాండ్ చేశారు.ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం,ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం తరిగొప్పుల మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జనగామ ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ ఇన్చార్జి చిలువేరు లింగం మాట్లాడుతూ... మత్స్య సహకార సంఘాలకు చేప పిల్లల పంపిణీకి బదులుగా నగదు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.దీనివల్ల సంఘాల సభ్యులు నాణ్యమైన చేప పిల్లలను స్వయంగా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
ముదిరాజుల చిరకాల డిమాండ్ అయిన బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించి అమలు చేయాలని కోరారు. దీనివల్ల ముదిరాజ్ యువతకు విద్య, ఉద్యోగ రంగాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ముదిరాజుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో మహాసభ మండల అధ్యక్షుడు సుంకరి నరసింహులు, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు పండుగ కనకయ్య,ఉపసర్పంచ్ చిలువేరు మహేందర్,వైస్ చైర్మన్ సుంకరి కనకరాజు,మాజీ ఎంపీటీసీ చిలువేరు సంపత్, సంఘం పెద్దలు కలకుంట్ల రాజు,డైరెక్టర్లు పండుగ శ్రీకాంత్, సుంకరి బాలరాజు,చిలువేరు రాజశేఖర్, భాషబోయిన రాజు,దండబోయిన రాములు, సుంకరి రవి,చిలువేరు సతీష్,భాషబోయిన మహేష్, చిలువేరు రాజు,కలకుంట్ల రాకేష్, సాయబోయిన నరసింహులు,చిలువేరు నాగరాజు, గంగరబోయిన కనకయ్య తదితరులు పాల్గొన్నారు.







