నర్మెట్ట, 2026-11-23
జనగామ నియోజకవర్గం, నర్మెట్ట మండలంలోని మచ్చుపహాడ్ గ్రామ అభివృద్ధి కోసం గ్రామ ప్రజలు ఐక్యంగా ముందుకు వస్తున్నారు. గ్రామంలో ఎన్నో ఏళ్లుగా నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారంతో పాటు కోతుల బెడద నివారణకు గ్రామస్తులు ప్రత్యేక చొరవ చూపుతున్నారు.

గ్రామంలో తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, లోవోల్టేజీ సమస్యతో విద్యుత్ సరఫరా సక్రమంగా అందకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సమస్య కారణంగా పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు గ్రామంలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూమి చదును పనుల కోసం గ్రామస్తులు సహకారం అందిస్తున్నారు.
అదేవిధంగా కోతుల బెడద కారణంగా రైతులు సాగు చేసిన పంటలు దెబ్బతింటూ తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ సమస్య పరిష్కారానికి కూడా గ్రామస్థులు ముందుకు వచ్చారు.
ఈ క్రమంలో గ్రామ సర్పంచ్ లింగాల హైమా రమేష్‌కు గౌడ సంఘం నాయకుల ఆధ్వర్యంలో కోతుల నివారణ చర్యల కోసం రూ.8,000, సబ్‌స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన భూమి చదును పనుల కోసం రూ.7,000 ఆర్థిక సహాయం అందజేశారు.
గ్రామ సమస్యల పరిష్కారానికి స్పందించి సహకారం అందించిన గౌడ సంఘం నాయకులకు సర్పంచ్ లింగాల హైమా రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.