సిద్దిపేట, 2026-11-20
తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి (మల్లన్న స్వామి) వారిని శుక్రవారం దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరి క్షేమం, అభివృద్ధి కోసం ఆయన స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించారు.
తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులైన శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి (మల్లన్న స్వామి) వారిని దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న స్పీకర్‌కు ఆలయ ఈవో శ్రీకాంత్ రావు, అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
స్పీకర్ సందేశం
ఈ సందర్భంగా స్పీకర్ గారు మాట్లాడుతూ.. కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి (మల్లన్న స్వామి)ని దర్శించుకున్నందుకు సంతోషంగా ఉంది. కొమరవెల్లి మల్లన్న స్వామి తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి, పాడి, పంటలతో రైతులు, ప్రజలు సంతోషంగా, క్షేమంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నాను. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే శక్తిని రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి ఇవ్వాలని ప్రార్థించాను.
భక్తుల విశ్వాసానికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించాను.







