Hyderabad, Narsingi, Telangana (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 19
హైదరాబాద్
హైదరాబాద్ నార్సింగిలోని పసిఫికా హిల్క్రెస్ట్ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్లోని ఓ బ్లాక్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నివాసితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం, ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా కలకలం రేగింది.







