Siddipet/Kondapak (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 24
కొండపాక మండలంలోని పెద్దమ్మ ఆలయంలో మంగళవారం ఉదయం పూజారి రాగుల దుర్గయ్య విద్యుత్ షాక్తో మృతి చెందారు. పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
కొండపాక మండలంలోని బందారం పెద్దమ్మ ఆలయంలో మంగళవారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్న రాగుల దుర్గయ్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో మంత్రదండం పట్టుకోగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానికులు తెలిపారు.
గ్రామంలో విషాదఛాయలు
ఈ ఆకస్మిక ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆలయంలో పూజలు నిర్వహించే పూజారి విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందడంతో గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పూజారి మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.







