పుట్టపర్తి, 9 November
కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నేత యాదగిరి పరామర్శ
మండలంలోని అబ్దుల్లాపూర్ నాగారం గ్రామానికి చెందిన మూల పెద్దరాజు అనారోగ్యంతో సోమవారం ఉదయం మృతి చెందారు.
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వగలబోయిన యాదగిరి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కావట్టి సుధాకర్, మూల రాములు గౌడ్, కొండ్ర కుమార్, భాషబోయిన రమేష్, తరాల సమ్మయ్య, పండుగ సాయిలు, సమ్మయ్య, భాషబోయిన వెంకన్న, రాజు, బైరగోని రాజుతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







