శ్రీరాములపల్లి, కోహెడ, వరంగల్, తెలంగాణ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 18
కోహెడ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గుండు రాకేష్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామం మరియు పరిసర ప్రాంతాల నుంచి 70 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు.
కోహెడ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈరోజు శ్రీరాములపల్లి గ్రామంలోని నూతన గ్రామపంచాయతీ కార్యాలయంలో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గుండు రాకేష్ ఆధ్వర్యంలో ఈ శిబిరం జరిగింది.
ఈ వైద్య శిబిరానికి గ్రామం తో పాటు పరిసర ప్రాంతాల నుంచి దాదాపు 70 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. నడుము నొప్పి, భుజం నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ల నొప్పులు, నరాల బలహీనత, పక్షవాతం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, తగిన వైద్య సూచనలు, సలహాలు అందించారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోలు శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి స్వరూప మేడం, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.







