నంగునూరు (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 17
దళితులకు ఇచ్చిన చేవెళ్ల డిక్లరేషన్ హామీలను అమలు చేయకుండా రేపు సిద్దిపేటలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డుకుంటామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి () టీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దేవులపల్లి రాజేందర్ మాదిగ హెచ్చరించారు. హామీలు నెరవేర్చకుంటే సీఎం సభను అడ్డుకుంటామని తెలిపారు.
దళితులకు ఇచ్చిన చేవెళ్ల డిక్లరేషన్ హామీలను అమలు చేయకుండా రేపు సిద్దిపేటకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డుకుంటామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి () టీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దేవులపల్లి రాజేందర్ మాదిగ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేడి పాప ఆర్ సి, రాష్ట్ర అధ్యక్షులు కే దాసి మోహన్ ల నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మార్పీఎస్ సూటి ప్రశ్నలు సంధించింది. ఈరోజు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమిగారి రాజేందర్, జిల్లా కార్యదర్శి లింగాల నరసింహులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాజేందర్ మాట్లాడుతూ, ఈనెల 19న సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట గడ్డపై అడుగుపెట్టే ముందు, దళితులకు ఇచ్చిన చేవెళ్ల డిక్లరేషన్ హామీలను ఎందుకు అమలు చేయలేదో దళితులకు సమాధానం చెప్పాలని, లేకపోతే దళిత సామాజిక వర్గం ఆ సభను అడ్డుకుంటుందని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పేరుకు మాత్రమే ఉన్నాయని, అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతున్నందున వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. చేవెళ్ల డిక్లరేషన్‌తో పాటు, గత అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితులకు అనేక వాగ్దానాలు చేశారని పేర్కొన్నారు. దళిత బంధు పథకం స్థానంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా దళితులకు 12 లక్షల రూపాయలు, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా సిద్దిపేటకు వస్తే సహించేది లేదని, ఆ లోపు అమలు చేయకపోతే అడ్డుకొని తీరుతామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి దేవులపల్లి కృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షులు దేవులపల్లి నాగరాజు, సీనియర్ నాయకులు రామగల నాగరాజు, భూమిగారి దామోదర్, సర్వగళ్ళ యాదయ్య, మల్లి వినయ్, భూమి విజయ్, సంజీలు, సుంచు సురేష్, చంటి, రాజు, వివేక్, కిరణ్, సాయి, ఎర్రోళ్ల హర్షిత్, భూమి దీక్షిత్, కనకయ్య, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.







