హుస్నాబాద్, 17 November
జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలను న్యాయవాదులు ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ కన్నోజు రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలను హుస్నాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్, మాజీ ఏజీపీ కన్నోజు రామకృష్ణ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సమక్షంలో కేక్ కట్ చేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కన్నోజు రామకృష్ణ మాట్లాడుతూ, కెప్టెన్ లక్ష్మీకాంతరావు దేశ రక్షణకై ఆర్మీలో చేరి, 1965లో ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో సరిహద్దుల్లో పాల్గొని కెప్టెన్‌గా తన సేవలు అందించారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పార్టీకి, పార్టీ అధినేత కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచారని కొనియాడారు.
సింగాపూర్ గ్రామ సర్పంచ్‌గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, మాజీ ఎంపీగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు సేవలు అందించారని తెలిపారు. వారి కుమారుడు వొడితల సతీష్ కుమార్ కూడా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు శాసనసభ్యులుగా గెలిచి ప్రజలకు సేవలు అందించారని, వారి కుటుంబం ఎల్లప్పుడూ పేదల కోసమే సేవలు అందించడానికి ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు డి. ప్రవీణ్, జాల జ్యోతికుమార్, కే. దేవందర్, ఎం. ఏసుదాస్, జుమ్లా నాయక్, యాల్ల సూర్య ప్రకాష్ రెడ్డి, జి. రఘువీర్, పార్నంది ప్రవీణ్, విశ్వతేజ, ఆంజనేయులు, ఎం. సాయి, తిరుపతి నాయక్, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.







