సిద్దిపేట, 16 November
సిద్దిపేట జిల్లాలో ఈనెల 19వ తేదీన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు భారీగా తరలిరావాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు పలు గ్రామాల్లో పర్యటించి నాయకులను కలిసి సభ విజయవంతం చేయాలని కోరారు.
సిద్దిపేట జిల్లాలో ఈనెల 19వ తేదీన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు భారీగా తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మంద ధర్మయ్య, కోహెడ మాజీ సర్పంచ్ దొమ్మాట జగన్ రెడ్డి ఈరోజు విజయనగర్ కాలనీ, నారాయణపూర్, పకీరు పల్లె, గొట్ల మిట్ట, తీగల గుంటపల్లి గ్రామాల్లో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిసి, భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.
అలాగే, రేపు 17వ తేదీన లక్ష్మి గార్డెన్లో మండలంలో మంజూరైన నూతన పెన్షన్ల ప్రారంభోత్సవానికి మంత్రివర్యులు వస్తున్నారని తెలియజేశారు. 20వ తేదీన వృద్ధులకు, దివ్యాంగులకు ఉచిత పరికరాలు అందిస్తారని గ్రామాల్లో ప్రచారం చేసి, అందరినీ తీసుకురావాలని కోరారు.
19వ తేదీన బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు భారీగా తరలిరావాలని కోరారు.







